బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్

బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

బంజారా కాలనీ యువతకు పార్టీ కండువా వేసి బీజేపీలోకి ఆహ్వానించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

 ఎల్బీనగర్ పెన్ పవర్ డిసెంబర్ 21:

హయత్ నగర్ డివిజన్‌లోని బంజారా కాలనికి చెందిన పలువురు యువకులు నేడు బీజేపీలో చేరిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి సమక్షంలో హయత్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువతకు పార్టీ కండువా వేసి అధికారికంగా బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ, యువత రాజకీయాల్లోకి రావడం పార్టీకి నూతన శక్తిని ఇస్తుందని, అభివృద్ధి రాజకీయాల కోసం బీజేపీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే పార్టీ ధ్యేయమని, యువత చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు బండారి భాస్కర్, డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు సంఘీ అశోక్ ,డివిజన్ ప్రధాన కార్యదర్శి గోవింద చారి, నాయకులు మధు సుధన్ బంజర కాలనీ బిజెపి నాయకులు జాంజా నాయక్, హరి నాయక్ , బాలు నాయక్, భరత్, చిరంజీవి మరియు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు...

About The Author: CHIRANJEEVI VADTHYA