మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన

మియాపూర్ ఘటనపై జాతీయ ఎస్టి కమిషన్ స్పందన 

 

మియాపూర్ ప్రైవేట్ హాస్టల్‌లో జరిగిన బనోత్ నగేష్ అనుమానాస్పద మరణంపై జాతీయ ఎస్టీ కమిషన్ చర్య

హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22

ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, మియాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో మరణించిన బనోత్ నగేష్ (ఖమ్మం జిల్లా -యోనెకుంట తండా) కేసుపై జాతీయ ఎస్టి కమిషన్ (NCST) విచారణ ప్రారంభించింది. ఈ మేరకు, సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అక్టోబర్ 7, 2025 న నోటీసు జారీచేసి, 15 రోజుల్లోపు కేసు పురోగతి, చర్యల వివరాలు సమర్పించాలని ఆదేశించింది. సమాధానం రాకపోతే, సివిల్ కోర్టు అధికారాలతో సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.

About The Author: CHIRANJEEVI VADTHYA