సిటీ కళాశాల లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ్ దివస్
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ్ దివస్
On
సిటీ కళాశాల లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ్ దివస్
హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 7:
సిటీ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతినీ నిర్వహించటం జరిగింది. కార్యక్రమంలో ఎబివిపి కళాశాల అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఎనలేనిది అని, ఎన్నో వడిదుడుకులను, ఆటంకాలను ఎదుర్కొని బలహీన వర్గాల పక్షాన నిలబడి, భారత రాజ్యంగ పితామహుడిగా పేరొందారు. మనిషి నీడ పడితే మైల పడిపోతాం అనే సమాజంలో మనిషిని మనిషిగా చూడటం నేర్పిన మనిషి అంబేద్కర్ అని ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శాంతి, శంకర్, భాస్కర్ , శ్రీశైలం, మరియు ఎబివిపి చార్మినార్ టౌన్ సెక్రటరీ అక్షయ్, విద్యార్థి నాయకులు ప్రశాంత్, శివ,కృష్ణ,శషి మరియు తదితర విద్యార్థులు పాల్గొన్నారు.

Tags:
