Pen Power

వర్షానికి కొబ్బరి చెట్టు పడి నేలకూలిన విద్యుత్ స్తంభం

వర్షానికి కొబ్బరి చెట్టు పడి నేలకూలిన విద్యుత్ స్తంభం

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, జూలై14: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడ పంచాయతీ అసరాడ కాలనీ గ్రామంలో ఆదివారం ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఎండిపోయిన కొబ్బరి చెట్టు విద్యుత్ వైర్లపై పడటంతో కరెంటు స్తంభం విరిగి నేల కూలింది.ఆ సమయమున అటు గుండా రాకపోకలు సాగించకపోవడం వలన పెద్ద ప్రమాదమే తప్పింది. స్తంభం నేల కూలీన సమయంలో కరెంటు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు.స్పందించిన లైన్మెన్లు సంఘటన స్థలానికి చేరుకొని అ విద్యుత్ లైన్ తప్పించారు.వేరే లైన్ ద్వారా విద్యుత్ పునరుద్ధరించారు.

విద్యుత్ లైన్ తప్పిస్తున్న లైన్మెన్ లు

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.