కట్టుపల్లిలో కూలిన భారీ వృక్షం- విరిగిన విద్యుత్ స్తంభం 

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 29: అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనాపల్లి పంచాయితీ కట్టుపల్లి గ్రామంలో  "మొంథా తుఫాన్ వల్ల వీచిన గాలులకు బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ పక్కన ఉన్న భారీ వృక్షం  నేల కూలింది. వృక్షం విద్యుత్ స్తంభం పై పడటంతో విద్యుత్  స్తంభం విరిగిపోయింది. మరి కొన్ని స్తంభాలు ఒరిగిపోయాయి. ఈ విషయాన్ని స్థానికులు  పోలీస్ మరియు రెవెన్యూ అధికారులకు, ఎంపీడీవో కార్యాలయానికి విద్యుత్ శాఖ అధికారులకు తెలియజేశారు.విద్యుత్ స్తంభాలను సరిచేసి విద్యుత్తును పునరుద్ధరించాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.