సర్పంచ్ రామకృష్ణ, ఎండిఏ కూటమి నాయకుల సారథ్యంలో రాజ్మా విత్తనాల పంపిణీ  

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 27:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం దామనపల్లి పంచాయతీ సచివాలయ నందు సర్పంచ్ కె రామకృష్ణ,ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వం అందిస్తున్న 90% రాయితీలతో రాజ్మా చిక్కుళ్ళ విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ రామకృష్ణ మాట్లాడుతూ గత మాదిరిగా వ్యవసాయానికి ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, కాబట్టి ప్రజలు గంజాయి ఇతర వ్యతిరేక పంటలపై మొగ్గు చూపకుండా వాటికి ప్రత్యామ్నాయ పంటలుగా లాభసాటిగా ఉన్న పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. రాజ్మా చిక్కుల విత్తనాలను చల్లుకుని ప్రతి ఒక్క రైతు ఈ పంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు. అలాగే వేసిన విత్తనాలకు ఇన్సూరెన్స్ కట్టుకున్నట్లయితే పంట నష్టం జరిగిన ప్రభుత్వం నుండి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉందని అన్నారు. అలాగే వ్యవసాయ శాఖ ద్వారా వ్యవసాయ అనుబంధ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు,పవర్ టిల్లర్లు,యంత్ర పరికరాలు ఇవ్వటం జరుగుతుంది కాబట్టే ప్రజల సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. అలాగే ప్రభుత్వం వ్యవసాయానికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తుంది కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు సాగిన బాలరాజు. వార్డు మెంబర్లు తగ్గి కృష్ణారావు, అగ్రికల్చర్ అసిస్టెంట్ జోసెఫ్, సచివాలయం కార్యదర్శి కళ్యాణ్ కృష్ణ,ప్రజలు పాల్గొన్నరు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.