గూడెం కొత్త వీధి,పెన్ పవర్,అక్టోబర్ 15: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయం కోసం దుకాణదారులు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుం
డి అనుమతులు పొందాలని గూడెం కొత్త వీధి సీఐ వరప్రసాద్ హెచ్చరించారు.అక్రమంగా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయం జరిపితే సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. బాణసంచా అమ్మకందారులు ముందుగానే అనుమతులు పొందడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చట్టబద్ధంగా విక్రయాలు జరపవచ్చని సీఐ వరప్రసాద్ తెలిపారు.