గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 18: గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండలంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ వైసీపీ నాయకులు నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు వనపల రాజేష్ ఒక ప్రకటనలో తెలిపారు. భారీ వర్షాలకు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాబట్టి ప్రజలు కాలువలను దాటే ప్రయత్నం చేయవద్దని, అత్యవసరం అయితేనే తప్ప ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని తెలిపారు. విద్యుత్ స్తంభాలను తాకరాదని, అంటువ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.