సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట, చిత్తులాటకు అనుమతి లేదు గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే అరెస్టులు తప్పవు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 11:సంక్రాంతి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడా కోడిపందాలు, పేకాట, చిత్తులాట వంటి అసాంఘిక కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం లేదని గూడెం కొత్త వీధి ఎస్సై సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే చట్ట ప్రకారం సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సందర్భంగా ఎస్సై సురేష్ మాట్లాడుతూ, ప్రజలు సాంప్రదాయబద్ధంగా, శాంతియుతంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలని సూచించారు. పండుగ పేరుతో ఎవరూ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడకూడదని తెలిపారు. కోడిపందాలు, పేకాట, చిత్తులాట వంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు పోలీసు శాఖకు సహకరించి ప్రశాంత వాతావరణంలో పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.