గూడెం కొత్తవీధి,పెన్ పవర్,సెప్టెంబర్ 29:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్త వీధి మండలం తహసీల్దార్ హెచ్ అన్నాజీ రావు ఆదేశాల మేరకు సిగినాపల్లి కొండపై రంగురాళ్ల క్వారీ తవ్వకాలను పూర్తి స్థాయిలో నిషేధించినట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 163 అమలులో ఉన్నందున, ఈ ప్రాంతానికి సమీపంగా ఎవ్వరూ తిరుగవద్దని,అక్కడా ఏ విధమైన తవ్వకాలు జరగవద్దని అధికారులు హెచ్చరించారు.ఈ నిషేధానికి సంబంధించిన సమాచారం దామనపల్లి,రింతాడ,సంకడా, సచివాలయాల వీఆర్వోలకు అందించబడినది.తహసీల్దార్ ఆదేశాల మేరకు దొడ్డికొండ,తీములబంధ,సంకడా, ఆసరాడ,రింతాడ,సిగినాపల్లి,గండేంపల్లి,నల్లబెల్లి,ఎస్.కొత్తూరు,కడుగుల,పులుసుమామిడి,గుర్రాలగొంది ఈ 12 గ్రామాల పరిధిలో 163 సెక్షన్ అమల్లో ఉంటుందని,ఈ గ్రామాల ప్రజలు సిగినాపల్లి కొండ చుట్టూ తిరగకుండా జాగ్రత్త వహించాలని,తహసీల్దార్ ఆదేశాలను జారీ చేశారు. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే,చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారికంగా హెచ్చరించారు.