గూడెం కొత్త వీధి,పెన్ పవర్ , ఆగస్టు 18: గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, రాబోయే 24 గంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్ తెలిపారు.ముఖ్యంగా, విద్యుత్ తీగలు తెగిన ప్రాంతాలు, నీటిమట్టం పెరిగిన వంతెనలు, చెరువులు, వాగులు దరిదాపులలోకి వెళ్లవద్దని హెచ్చరికచేశారు. అత్యవసరమైతేనే తప్ప ఇంటి నుండి బయటకు రావద్దని, ముఖ్యంగా వృద్ధులు చిన్నారులు గర్భిణీలు తగిన జాగ్రత్తగా పాటించాలని సూచించారు. కాలువలు పొంగిపొర్లుతూ ఉండటంతో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు, ఉద్యోగులకు ప్రయాణంలో జాగ్రత్తలు అవసరమని అన్నారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.