గూడెం కొత్తవీధి,పెన్ పవర్,మే01: శుక్రవారం జరిగే మన్యం బందును వైసీపీ శ్రేణులు విజయవంతం చేయాలని గూడెం కొత్త వీధి మండల ఎంపీపీ బోయినకుమారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీవో నెంబర్ మూడుకు ప్రత్యామ్నాయంగా నూతన జీవో ఏర్పాటు చేయాలని, గిరిజనులకు ఆదివాసి స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ఆదివాసీ ప్రత్యేక డీఎస్సీ సాధన కమిటీ మరియు ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న బందుకు వైసిపి జిల్లా అధ్యక్షులు సూచనల మేరకు వైసీపీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని ఎంపీపీ బోయిన కుమారి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వంలో అధికారంలో వచ్చాక జీవో నెంబర్ 3 పునరుద్ధరించి గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనులకే వచ్చేలా చూసే బాధ్యత నాదని తెలిపారని ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెంబర్ మూడుకు ప్రత్యామ్నాయంగా త్వరితగతిన ఏర్పాటు చేసి మాట నిలుపుకోవాలని ఎంపీపీ కుమారి డిమాండ్ చేశా