పశువైద్యాధికారి డాక్టర్ లోకుల రమేష్ ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం

125 పశువులకు టీకాలు – బీమా సౌకర్యంపై అవగాహన

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 19:ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 19 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా రింతాడ మండలంలో మెగా పశువైద్య శిబిరాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు.మండల వ్యాప్తంగా 3 ప్రత్యేక వైద్య బృందాలతో మొత్తం 13 మెగా పశువైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం (19-01-2026) రింతాడ పంచాయతీ ముళ్లమెట్ట గ్రామంలో మెగా పశువైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో 125 పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు, 128 కోళ్లకు రాణికెట్ వ్యాధి టీకాలు, 183 మేకలకు గోట్ పాక్స్, 90 గొర్రెలకు షీప్ పాక్స్ వ్యాధి నివారణ ముందస్తు టీకాలు వేశారు.అదేవిధంగా అన్ని పశువులకు పాముల మందును పంపిణీ చేశారు.అలాగే పశు బీమా పథకం కింద 10 పశువులకు రూ.30,000 విలువైన బీమాను కేవలం రూ.298 (15 శాతం రైతు వాటా, 85 శాతం ప్రభుత్వ సబ్సిడీ)తో మూడు సంవత్సరాల కాలానికి కల్పించారు. మేకలు, గొర్రెలకు ఒక్కొక్కటికి కేవలం రూ.27 చెల్లించి రూ.2,000 విలువైన ఒక సంవత్సరం బీమాను 15 మేకలు, గొర్రెలకు అందజేశారు. పూర్తిగా 100 శాతం సబ్సిడీతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పశుగ్రహశాలలను రైతులు నిర్మించుకోవచ్చని పశువైద్యాధికారి లోకుల రమేష్ తెలిపారు. రైతులందరూ ఈ పశు ఆరోగ్య శిబిరాలు, బీమా సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మడపాల సోమేశ్ కుమార్,పేసా కార్యదర్శి, జనసేన నాయకులు గబులంగి గణేష్ పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది జెవిఒ రజని, ఏహెచ్ఏలు శశికాంత్, కృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.