గూడెం కొత్త వీధి,పెన్ పవర్, అక్టోబర్ 28: “మొంథా తుఫాన్” నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు గొర్లే వీర వెంకట్ ప్రజలకు సూచించారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఎవరూ బయటకు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో లేదా పాడుబడిన ఇండ్లు, పాకల వద్ద ఉండరాదని ప్రజలను హెచ్చరించారు. అదేవిధంగా వాగులు, గెడ్డలు దాటే ప్రయత్నం చేయకుండా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు చేపట్టే సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే, జనసేన కార్యకర్తలు స్వచ్ఛందంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.జానపద కళలు మరియు సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసైనికులు సిద్ధంగా ఉండాలని వీర వెంకట్ తెలిపారు. ప్రజల భద్రతే ప్రాధాన్యమని ఆయన పునరుద్ఘాటించారు.