గూడెం కొత్త వీధి,పెన్ పవర్, నవంబర్ 27: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ నెల 28వ తేదీ శుక్రవారం పాడేరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు గూడెం కొత్త వీధి ఎంపీడీవో బిహెచ్వి రమణబాబు తెలిపారు.ఆయన మాట్లాడుతూ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతీ యువకులకు ఇది ఒక సువర్ణావకాశం అన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో మొత్తం 12 కంపెనీలు పాల్గొంటున్నాయి. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారెవరైనా ఈ మేళాలో పాల్గొనడానికి అర్హులు. అర్హులైన అభ్యర్థులకు కంపెనీలు అక్కడికక్కడే ఆఫర్ లెటర్లను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. చదువుకున్న యువతి యువకులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సూచించారు.మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు 6302636174 లేదా 7569923256 నెంబర్లను సంప్రదించవచ్చు అన్నారు.