భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ బోయిన కుమారి సూచన

గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు26:కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గూడెం కొత్తవీధి ఎంపీపీ బోయిన కుమారి కోరారు. వర్షాలను దృష్టిలో ఉంచుకుని ఆమె మంగళవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు.ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వాగులు, కాలువలు దాటేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె తెలిపారు. భారీ వర్షాల కారణంగా వాగులు పొంగి ప్రవహించే అవకాశం ఉండడంతో వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.వర్షాల కారణంగా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు నీటిని మరిగించి చల్లార్చి తాగాలని సూచించారు. విద్యుత్ స్తంభాలకు తాకకూడదని, వర్షాలకు వాటిలో విద్యుత్ ప్రవహించే అవకాశం ఉండటంతో ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూచించారు. వర్షాలపై నిరంతరం గమనిస్తూ ప్రతి గ్రామంలో పరిస్థితిని పర్యవేక్షించాలని, అలాగే అంటువ్యాధులు వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు

.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.