గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 21:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలోని 16 గ్రామ పంచాయతీల పరిధిలో ఆగస్టు 23వ తారీఖున నిర్వహించే జాతీయ ఉపాధి హామీ పథకం పనుల గుర్తింపు కోసం చేపట్టే పంచాయతీ గ్రామ సభల్లో మండలంలోని అన్ని పంచాయతీల్లోనూ ఉన్న ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు తప్పనిసరిగా పాల్గొనాలని గూడెం కొత్తవీధి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముక్కలి రమేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గాను గ్రామసభల ద్వారా పనులను ఎంపిక చేసుకునే అవకాశాన్ని నేరుగా ప్రజలకు అందిస్తుందని ప్రజలే ఈ గ్రామ సభలకు పాల్గొని తమ తమ గ్రామాలలో ఏఏ పనులు ఈ ఆర్థిక సంవత్సరానికి చేపట్టాలో వంటి విషయాలను ఈ గ్రామసభలో చర్చించడానికి భాగస్వామ్యం కల్పించడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారని దీనిని ప్రతి ఒక్కరు గ్రామసభల ద్వారా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.అలాగే ఈ గ్రామ సభలో తప్పనిసరిగా ఎన్డీఏ నేతలు పాల్గొని ఏయే గ్రామాలలో ఏఏ కార్యక్రమాలు అమలు చేయాలన్న విషయాన్ని గ్రామ సభల్లో తెలియజేయాలని ఆయన కోరారు.