స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/కొయ్యూరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్సె,ప్టెంబర్ 29: అల్లూరి సీతారామరాజు జిల్లా కోయ్యూరు మండలం రావణాపల్లి సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారు రోడ్డు పక్కన ఉన్న లోయలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.