గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 18:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది.వర్షాల కారణంగా వాగులు పొంగే అవకాశం ఉన్నందున, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు, నీటి ప్రవాహాలు దాటవద్దని జీకే వీధి ఎస్ఐ కె.అప్పలసూరి విజ్ఞప్తి చేశారు.వర్షాలకు మట్టితో నిర్మించిన పాడుబడిన మిద్దె ఇళ్లలో నివసించే వారు వెంటనే సురక్షితమైన ప్రాంతాలకు తరలిపోవాలని కోరుతున్నారు.ఇది వారి ప్రాణాలకు ప్రమాదం కలిగించే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలని సూచించారు.అలాగే వర్షాల కారణంగా రోడ్లపై చెట్లు పడిన, లేదా కరెంటు స్తంభాలపై చెట్లు పడిన ఘటనలు ఎక్కడైనా చోటు చేసుకున్నచో,స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెంటనే సమాచారం అందించాల్సిందిగా ప్రజలను కోరారు. వర్షాల నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎస్సై అప్పలసూరి ప్రకటన విడుదల చేశారు.