గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఆగస్టు 11:అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రాంలో ఉమ్మడి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ఈ నెల 12వ తేదీ అనగా మంగళవారం చింతపల్లిలో పర్యటించనున్నారని జనసేన పార్టీ అరుకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గొర్లె వీర వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ నందు అల్లూరి సీతారామరాజు విగ్రహవిష్కరణ చేయటం జరుగుతుందని, అనంతరం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం మరియు జనసేన పార్టీలో నూతనంగా పార్టీలో చేరేవారికి పార్టీలో చేర్చుకునే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున గూడెం కొత్త వీధి, చింతపల్లి మండలాల జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.