దొడ్డి కొండలో చెట్టును తొలగించిన సర్పంచ్ రామకృష్ణ
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,అక్టోబర్ 29:మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దామనపల్లి పంచాయతీ పరిధిలోని దొడ్డి కొండ గ్రామంలో భారీ గాలులు వీచాయి. ఆ గాలుల ప్రభావంతో గ్రామంలో చింత చెట్టు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.విషయం తెలుసుకున్న దామనపల్లి సర్పంచ్ కుందేరి రామకృష్ణ వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చెట్టును తొలగించేందుకు స్థానిక గ్రామస్థులతో కలిసి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పేసా ఉపాధ్యక్షులు మాదిరి చంటిబాబు రాజేష్, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొని సహకరించారు.