స్టాఫ్ రిపోర్టర్,పాడేరు,చింతపల్లి,పెన్ పవర్,ఆగస్టు 27: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో పశువులను విచ్చలవిడిగా వదిలేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.మంగళవారం సాయంకాలం జీసిసి పెట్రోల్ బంక్, కొత్త బస్టాండ్ పరిధిలో పశువులు విచ్చలవిడిగా రోడ్డుపైకి రావటంతో ప్రయాణం చేసే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. పశువుల వలన వాహనదారులకు,పాదచారులకు ఏదైనా ప్రమాదం పొంచుతుందోమని బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు సాగిస్తున్నారు. పశువుల యొక్క యజమానులు పశువులను రోడ్ల పైన వదిలేయడంతో యజమానులకు పంచాయతీ అధికారులు తెలియజేయాలని స్పందించకపోతే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.