గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఆగస్టు 17:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం రింతాడా పంచాయతీ కేంద్రంలోని రింతాడ వై జంక్షన్ వద్ద వర్షం పడితే రోడ్డు చెరువును తలపిస్తుంది. నేషనల్ హైవే నిర్మిస్తుండటంతో కేడీపేట చింతపల్లి మార్గం రోడ్డు ఎత్తు పెంచటంతో గూడెం కొత్తవీధి వైపు వెళుతున్న రోడ్డు డౌన్ అయిపోయింది.దీంతో వర్షం పడితే ఎగువ ప్రాంతాల నీరు ఈ రోడ్డుపైకి వచ్చి చెరువును తలపిస్తుంది.దీంతో వాహన చోదకులు, పాదచారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇక్కడ నీరు నిల్వ లేకుండా చేయాలని పలువురు వాహన చోధకులు డిమాండ్ చేస్తున్నారు.