Pen Power

మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు.

మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు.

రావులపాలెం

 రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుత్తులపట్టాభి రామారావు మండల బీసీ సెల్ అధ్యక్షులు కోట వెంకటేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా తెలుగు యువత అధ్యక్షులు చిలువూరు సతీష్ రాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మన ఉన్నతి కోసం కృషి చేసిన మహానుభావులను మనమంతా గుర్తించి, గౌరవించాలన్నారు. మహానుభావుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని,ప్రతిఒక్కరూ మహాత్మా జ్యోతిబా పూలే అడుగుజాడల్లో నడుస్తూ, వారి ఆశయాల సాధనకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆనాడు పూలే లాంటి ఎందరో మహానుభావుల పోరాటాల కారణంగానే నేడు మనం సమాన హక్కులు పొంది స్వేచ్ఛగా జీవిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జక్కంపూడి వెంకట స్వామి,గ్రామ పార్టీ అధ్యక్షులు పడాల  ఋలి కొండా రెడ్డి,చిన్న కెవి,బొంతు రాంబాబు,వడ్లమూడి రామారావు,గుత్తుల కేశవరావు, బాలరాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About The Author: Admin

Admin  Picture