మారేడుమిల్లిలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థుల విస్తృత ప్రచారం

గంగవరం/ మారేడుమిల్లి ,


మారేడుమిల్లికి ప్రత్యేక గుర్తింపు తెస్తాం ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత


రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులైన బిజెపి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ,టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష దేవి గురువారం మారేడుమిల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ ఎంపీ గా నెగ్గిన వెంటనే గిరిజనయువత గ్రామాలు వదలి వలసలు వెళ్లకుండా స్థానిక మండలాలలో ఉపాధి యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు  నెలకొల్పి , ఉద్యోగ అవకాశాలు  కల్పిస్తామని అరకు నియోజకవర్గంలో మారేడు మిల్లికి ప్రత్యేక గుర్తింపు మండలంగా గుర్తించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారులు వైసిపి పార్టీకి అనుగుణంగా మారి ఉమ్మడి అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఈ విషయంపై ఈసి కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. గిరిజనులకు అందాల్సిన నిధులు సైతం ప్రభుత్వం అందించదంలేదని,
విద్య,వైద్యం మారుమూల ప్రాంతాలకు అందిచేందుకు అన్నివిధాలా కృషి చేస్తామని
సర్వశిక్ష అభియాన్,ఏకలవ్య స్కూళ్ల ద్వారా విద్యను విస్త్రుతతపరుస్థామని,
కనీసం మందులు సైతం అందించకుండా పీ హెచ్ సి లు  ఉన్నాయని ,పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతగిరిలో నిన్న సైతం పసిబిడ్డ మృతదేహాన్ని తండ్రి డోలితో మోసుకెళ్తుంటే బాధ కల్గిందని కానీ అధికారులు స్పందించలేదని అన్నారు. టీడీపీ ఎంఎల్ఏ అభ్యర్థి మిరియాల శిరీష  మాట్లాడుతూ టీడీపీ లో సామాన్యులకు న్యాయం జరుగుతుందని గిరిజన బిడ్డగా ఆదరించి టీడీపీ టికెట్ కేటాయించిందని నా గెలుపునకు ప్రజలంతా ఓటు వేసి ఆశీర్వదించాలని,ఎంపీ అభ్యర్థి గీత గారిని అత్యధిక మెజారిటీతో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బిజెపి, టిడిపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.

About The Author: Admin