కొనకనమిట్ల పెన్ పవర్ ఫిబ్రవరి 11 ; మండల కేంద్రమైన కొనకనమిట్ల మీదుగా పలు గ్రామాలకు అక్రమంగా తరలిస్తున్న మద్యం మంగళవారం పెద్ద ఎత్తున పట్టుబడింది.జిల్లా ఎక్సైజ్ అధికారులకు అందిన సమాచారం మేరకు జిల్లా ఎక్సైజ్ బృందం తమ సిబ్బందితో కలిసి కొనకనమిట్ల నుండి గ్రామాలకు వెళ్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించి పట్టుకున్నట్లు తెలియచేశారు.వాహనంలో ఉన్న పలురకాల 18 కేసుల మద్యం బాటిళ్లను మరియు 1 కేసు బీరు సీసాలను స్వాధీనం చేసుకునీ వాహనంతో పాటు మద్యం తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నట్లు తెలియచేసారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలియచేశారు