బాల్య వివాహాలను సమూలంగా నిర్ములించాలి

child-marriage-should-be-eradicated

బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దు

జాయింట్ కలెక్టర్, ఐసీడీఎస్ పీడీ, ఇతర అధికారులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ 

స్టాఫ్ రిపోర్టర్  పెన్ పవర్    విశాఖపట్నం, అక్టోబర్ 07 :


ఎట్టి పరిస్థితుల్లోనూ బాల్య వివాహాలను ఎవరూ ప్రోత్సహించవద్దని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ హితవుపలికారు. బాల్య వివాహాల చట్టం -2006 ప్రకారం 18 సంవత్సరాల లోపు ఆడ పిల్లలకు, 21 సంవత్సరాల లోపు మగ పిల్లలకు వివాహం చేయడం చట్ట రీత్యా నేరమని, బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, హాజరైనా నిందితులే అవుతారని హెచ్చరించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన పి.జి.ఆర్.ఎస్.లో జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్, ఐసీడీఎస్ పీడీ జయదేవిలతో కలిసి బాల్య వివాహాలపై రూపొందించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాల్య వివాహాల వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయని.. వాటిని ఎవరూ ప్రోత్సహహించవద్దని హితవు పలికారు. ఎవరైనా తప్పు చేసినట్లు తేలితే రెండేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా ఉంటుందని, నాన్ బెయిల్ బుల్ కేసు పెడతారని చెప్పారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.  ఈ కర్యక్రమం లో ఐసీడీఎస్ పిడీ జయదేవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

About The Author: Admin