భోగి,సంక్రాంతి,కనుమ పండుగలు ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి

మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను

భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, కొత్త ఉత్సా హాన్ని నింపాలని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్య క్షులు, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను ఆకాంక్షించారు.
పండుగల సందర్భంగా ఆయన ప్రజలకు హృ దయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగువారి సం స్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన సంక్రాం తి పండుగ ప్రతి ఇంట్లో ఆనందం, ఐక్యతను పెంపొందించాలని అన్నారు.రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే ఈ శుభసమయంలో గ్రామాలు పాడిపం టలతో కళకళలాడాలని, రైతులు ఆయురారో గ్యాలతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.
ప్రజలందరూ భోగి, సంక్రాంతి, కనుమ పండు గలను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందో త్సాహాల మధ్య జరుపుకోవాలని, ఈ పండుగ లు ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు, శుభఫ లితాలను తీసుకురావాలని శ్రీ మజ్జి శ్రీనివాసరా వు ఆకాంక్షించారు.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.