అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో అల్పహారం పంపిణీ

పాల్గొన్న చింతకాయల పద్మావతి

 

​నర్సీపట్నం, ఫిబ్రవరి 16:

నర్సీపట్నం మున్సిపాలిటీ శివారు ఉత్తరవాహినిలో పుణ్యస్నానాలకు భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల పుణ్య స్నానాలకు తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం శ్రీరమా సమేత  సత్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద  అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల పద్మావతి  స్వయంగా పాల్గొని భక్తులకు అల్పాహారాన్ని వడ్డించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే భక్తులకు అల్పాహారం అందజేస్తూ వారి సేవలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. మహాశివరాత్రి పురస్కరించుకుని స్నానాల  అనంతరం పాకలపాటి గురువుగారిని దర్సించుకుని, సత్యన్నారాయణ స్వామిని దర్సించుకున్న అనంతరం  భక్తులు అల్పాహార స్వీకరించారు.

About The Author: SIVAKUMAR.L