దుండిగల్‌ జీహెచ్ఎంసి సర్కిల్.. గాగిల్లాపూర్‌‌లో కూల్చివేతలు..

కోర్టు పరిధిలోని వివాదాస్పద భూమిలో..! అనుమతుల్లేని అక్రమ నిర్మాణాలు..

దుండిగల్‌ సర్కిల్ గాగిల్లాపూర్‌‌లో టౌన్‌ప్లానింగ్ కూల్చివేతలు..

 

*గాగిల్లాపూర్‌‌లో 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో అక్రమంగా నిర్మించిన గదులు..*

 

*జీహెచ్ఎంసిలో విలీనమైన దుండిగల్‌ మున్సిపాలిటీలో "తొలి కూల్చివేతలు"..*

 

*సర్వే నెం.235 భూమి కోర్టు వివాదంలో ఉండగా.!జీహెచ్ఎంసి పర్మిషన్‌ కూడా లేదు..*

 

*పత్రికల్లో వార్తా కథనాలు, ప్రజల ఫిర్యాదు లతో..టిపిఎస్ క్షేత్రస్థాయి పరిశీలన..*

 

*అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించి టౌన్‌ప్లానింగ్ అధికారి సంజునా ఆధ్వర్యంలో చర్యలు..*

 

*కోర్టు వివాదం, ప్రభుత్వ భూములు, పర్మిషన్‌ లు లేని కట్టడాలపై చర్యలు తప్పవని హెచ్చరిక..*

 

*కూల్చివేతల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు సమాచారం..*

 

దుండిగల్‌, పెన్ పవర్, డిసెంబర్ 4:

 

దుండిగల్‌ మున్సిపాలిటీని, జీహెచ్ఎంసిలో విలీనం చేసిన తొలిరోజే, కోర్టు కేసులో ఉన్న ఓ వివాదాస్పద భూమిలో, అక్రమంగా నిర్మించిన కమర్షియల్ నిర్మాణాలను దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారులు గురువారం కూల్చేశారు.. దుండిగల్‌ జీహెచ్ఎంసి సర్కిల్‌‌ పరిధిలోని గాగిల్లాపూర్‌ సర్వే నెం.235 వివాదాస్పద భూమిలో అక్రమంగా నిర్మించిన, గదుల కూల్చివేతల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.. జీహెచ్ఎంసి అనుమతులు తీసుకోకుండా,ఓవైపు కోర్టు కేసులో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదులు..! మరోవైపు హెచ్ఎండిఏ 100 ఫీట్ల మాస్టర్ ప్లాన్ రోడ్డులో నిర్మించన గదులపై, దుండిగల్‌ జీహెచ్ఎంసి టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించారు.. అక్రమంగా నిర్మించిన గదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి, అక్రమ నిర్మాణాలుగా నిర్ధారించుకుని కూల్చివేతలు జరిపినట్లు తెలిపారు.. గాగిల్లాపూర్‌ సర్వే నెం. 235 89/2023, 69/2024, 74/2024, 324/2024 కేసులు నమోదు కాగా..! ఈ భూమికి సంబంధించి డబ్ల్యు.పి. నెం. 28044/2024, 14557/2024, 28044/2024 కేసులు న్యాయస్థానంలో విచారణలో ఉన్నట్లు తెలుస్తుంది..

 

అటు హైకోర్టు పరిధిలో..! ఇటు జీహెచ్ఎంసి అనుమతుల్లేవు..!

 

 

ఓవైపు హైకోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూమి.. మరోవైపు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండానే పెద్ద ఎత్తున వ్యాపారాత్మక షెడ్లు నిర్మించి గదులుగా మారుస్తూ అద్దెకు ఇవ్వడానికి ప్రయత్నాలు జరిగినట్లు స్థానికుల ఆరోపణలతో, ప్రజలు ఫిర్యాదులు జీహెచ్ఎంసి దృష్టికి వచ్చాయని.దీంతో దుండిగల్‌ సర్కిల్‌కు చెందిన అధికారులు స్థలాన్ని పరిశీలించి, కోర్టు కేసులో ఉన్న భూమిపై అనుమతుల్లేని నిర్మాణాలుగా నిర్ధారించారు. అనంతరం జేసీబీ యంత్రాల సహాయంతో అక్రమంగా నిర్మించిన గదులను కూల్చివేసినట్టు టౌన్‌ప్లానింగ్ అధికారి టిపిఎస్ సంజునా తెలిపారు..కోర్టు వివాదంలో ఉన్న భూములు, ప్రభుత్వ భూముల్లో, నిర్మాణాలు పూర్తిగా నిషేధం అంటూ టిపిఎస్ హెచ్చరించారు.. మరోవైపు అనుమతులు కూడా లేకుండా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవనితప్పవని టిపిఎస్ సంజునా హెచ్చరించారు.. 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.