శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

శివ మాలధారణ చేసిన సతీష్ కుమార్ గౌడ్, స్వాములు

ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో నిత్యాన్నదానం

ఎల్బీనగర్ పెన్ పవర్ అక్టోబర్ 22

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తంగా తెలియజెప్పేందుకు తమవంతు కృషి చేస్తున్నామని శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో బుధవారం ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి శివ మాలధారణ చేసి సుమారు 48 మంది స్వాములకు మాలలు వేశారు. అనంతరం దేవాలయంలో శివుడికి వివిధ రకాల అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లుగా శివ మాలధారణ చేసి మండల కాలం పాటు దీక్షలు చేస్తున్నామని తెలిపారు. మాలధారణ చేసిన వందలాది మంది స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ప్రతియేడు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన అన్నారు. ఈ సంవత్సరం కూడా ప్రతినిత్యం వందలాది మంది స్వాములకు నిత్యాన్నదానాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమతోపాటు మండల కాలం పాటు దీక్షలు పూర్తయిన తరువాత స్వాములకు దేవాలయ ప్రాంగణంలో ఇరుముడులు కట్టించి వాహనాల్లో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లి తన సొంత ఖర్చులతో ఉచితంగా స్వామివారి స్పర్శ దర్శనంతో పాటు వసతిని కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. శివ మాలధారణ మండలం కాలం, అర్థ మండలం కాలం పాటు వేసుకోవచ్చునని ఆయన తెలిపారు. దీంతోపాటు శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయం అభివృద్ధికి తనవంతు చర్యలు తీసుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ అర్చకులు, సిబ్బందితో పాటు అధిక సంఖ్యలో శివ స్వాములు, గురుస్వాములు పాల్గొన్నారు.

About The Author: CHIRANJEEVI VADTHYA