గాగిల్లాపూర్‌ ఉస్మాన్‌కుంటను.. సందర్శించిన హైడ్రా ఎస్పీ అశోక్..

చెరువు ఆక్రమణపై స్థానిక తహశీల్దార్‌ మతీన్‌ని ప్రశ్నించిన హైడ్రా అధికారులు..

 

గాగిల్లాపూర్‌ ఉస్మాన్ కుంటపై సమగ్ర సర్వే చేయాలని ఆదేశం..

 

కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పిర్యాదు మేరకు స్పందించిన హైడ్రా..

హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఉస్మాన్‌కుంటను సందర్శించిన ఎస్పీ..

చెరువు ఆక్రమణపై స్థానిక తహశీల్దార్‌ మతీన్‌ని ప్రశ్నించిన హైడ్రా అధికారులు..

ఉస్మాన్‌కుంటలో హైడ్రా అధికారులు..

 

పత్రికల్లో వచ్చే కథనాలు‌ నిరాధారమైనవని తహశీల్దార్ మతీన్ సమాధానం.. 

 

దుండిగల్‌, పెన్ పవర్, ఆగస్టు 29:

 

దుండిగల్ మున్సిపాలిటీ గాగిల్లాపూర్ లోని ఉస్మాన్‌కుంట,214 ప్రభుత్వ భూమి కబ్జాలపై సంపూర్ణ సర్వే నిర్వహించి నివేదికను సమర్పించాలని హైడ్రా ఎస్పీ అశోక్ నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశించారు.. కుత్బుల్లాపూర్ బీజేపీ నేతలు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి పిర్యాదు మేరకు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించి విచారణకు ఆదేశించారు..  శుక్రవారం హైడ్రా ఎస్పీ అశోక్ ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి గాగిల్లాపూర్‌‌లోని వెంకట ప్రణీత్ డెవలపర్స్ నిర్మిస్తున్న ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్కును పరిశీలించారు. ఉస్మాన్‌కుంట ఎఫ్‌టిఎల్‌, బఫర్ స్థలంతో పాటు ఉస్మాన్‌కుంట ఫీడర్ చానల్‌ను పరిశీలించారు. ప్రభుత్వ భూమి 204, 214 కబ్జాలపై తహసిల్దార్ మతిన్‌ను ప్రశ్నించారు..! అందుకు ప్రభుత్వ భూమి కబ్జా అయ్యిందనే విషయాన్ని దుండిగల్‌ తహశీల్దార్ మతీన్‌తో ప్రస్తావించగా..! తహశీల్దార్ దిమ్మతిరిగే సమాధానం పలు అనుమానాలకు తావిస్తోంది..  కేవలం అరోపణలే అంటూ కొట్టి పారేశారు.. ప్రభుత్వ భూమి కబ్జాపై సర్వే చేస్తామని తెలిపారు. ఓ వైపు కబ్జాలు జరుగుతున్నాయి పత్రికల్లో వార్తా కథనాలు వస్తుంటే ఇదేమిటని వెంటనే ప్రభుత్వ భూముల కబ్జాపై సర్వే చేయాలని ఆదేశించారు. ఇక ఉస్మాన్‌కుంట ఎఫ్‌టిఎల్‌ బఫర్, కట్ట బఫర్, ఫీడర్ చానల్ బఫర్‌పై "డీజీపీఎస్" సర్వే చేసి నివేదిక ఇవ్వాలని  ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మార్వో మతిన్, కమిషనర్ వెంకటేష్ నాయక్, ఇరిగేషన్ డీ ఈ ఈ ఉదయ్ భాస్కర్, ఏ ఈ స్వప్న, పలువురు అధికారులు పాల్గొన్నారు..

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.