సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి ప్రారంభం

పారిశ్రామిక ప్రాంత ప్రజల కల సాకారం

విశాఖ పారిశ్రామిక ప్రాంత ప్రజల ఎన్నాళ్లనో ఎదురుచూస్తున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ డాక్యార్డ్ బ్రిడ్జి నేడు ప్రజా వినియోగానికి అందింది. సిందియా నుంచి కాన్వెంట్ వరకు వెళ్లే ఈ వంతెనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు  గణబాబు ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్ అధికారులు, నేవల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బ్రిడ్జి ప్రారంభంతో పారిశ్రామిక ప్రాంతం నుంచి నగర కేంద్రానికి రాకపోకలు సులభతరం కానున్నాయి.
ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, “పారిశ్రామిక ప్రాంత ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రాక పోకలు అందించడమే మా లక్ష్యం. నేను ఇచ్చిన మాట నేడు నెరవేరింది, అన్నారు.
స్థానిక ప్రజలు ఈ వంతెన ప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఎమ్మెల్యే గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.