చలకుర్తి చిన్నారుల ఖాతాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

చలకుర్తి చిన్నారుల ఖాతాలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్

హైదరాబాద్ పెన్ పవర్ నవంబర్ 23:

నగరం లోని సరూర్నగర్ ఇండోర్ స్టేడియం లో నిర్వహించిన *లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్* నందు పాల్గొని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడంలో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమార్, ప్రియాంక ల కుమార్తె పాతనబోయిన సుదీక్ష , కుమారుడు పాతనబోయిన విహాస్ భాగస్వామ్యులు అయ్యారు. ఇట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు తెలంగాణ కు చెందిన పలువురు మార్షల్ ఆర్ట్స్ కరాటే , టెక్వాండో , కుంగ్ ఫూ క్రీడాకారులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ ఇట్టి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించడం సంతోషంగా ఉందని, ఇట్టి రికార్డ్ తమపై మరింత బాధ్యత కూడా పెంచిందని మునుముందు మరింత కఠోరశ్రమతో సాధన చేసి మరెన్నో రికార్డులు సాధించి తల్లితండ్రులకు, పుట్టిన ఊరికి, తెలంగాణ రాష్ట్రానికి పేరు తీసుకువస్తామని , చిన్ననాటి నుండే శిక్షణ ఇప్పించి నిరంతరం తమవెంట ఉండి నడిపిస్తున్న తల్లితండ్రులకు, శిక్షణలో మెళకువలు నేర్పించి మంచి మంచి అవకాశాలు ఏర్పాటు చేసిన కోచ్ మహేష్ నాయక్ మాస్టర్ , శివ మాస్టర్ , ఆర్.మహేష్ మాస్టర్ లకు ధన్యవాదాలు తెలియచేశారు.

About The Author: CHIRANJEEVI VADTHYA