శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు

శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయ పరిసరాలు

శ్రీశైల క్షేత్రానికి తరలిన శివ స్వాములు

 శివ నామస్మరణతో మార్మోగిన దేవాలయ పరిసరాలు

శివ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేస్తాం: ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్

ఎల్బీనగర్, పెన్ పవర్ డిసెంబర్ 01:

శివమాల ధారణ చేసిన స్వాములు మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకుని సోమవారం ఉదయం ఇరుముడులు కట్టుకొని ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైలం పుణ్యక్షేత్రానికి తరలివెళ్లారు. శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు, సాహెబ్ నగర్ శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామి దేవాలయ చైర్మన్ ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అక్టోబర్ 22వ తేదీన వందలాదిమంది శివ స్వాములకు మాలధారణ చేయించారు. మండల కాలం పాటు దీక్షలు చేసిన స్వాములకు సోమవారం వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు ఇరుముడులు కట్టుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులో ఆ శివయ్య దర్శనార్థం శ్రీశైల క్షేత్రానికి తరలివెళ్లారు ఈ సందర్భంగా దేవాలయ పరిసరాలు ఓం నమ: శివాయ నామస్మరణతో మార్మోగాయి. ఈ సందర్భంగా ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి మాట్లాడుతూ శివ మాలధారణ చేసే స్వాములకు నూతన వస్త్రాల పంపిణీ, మాలాధారణ కిట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. మండల కాలం పాటు శివ స్వాములు, అయ్యప్ప స్వాములు, హనుమాన్ స్వాములు, భవాని స్వాములు, వందలాది మందికి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. మండల కాలం పాటు దీక్షలు పూర్తి చేసుకున్న స్వాములకు ఇరుముడులు కట్టించి ఆర్టీసీ ప్రత్యేక బస్సులో స్వాములను శ్రీశైల క్షేత్రానికి తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. శివ నామాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఎనలేని కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతియేడు శివ మాలధారణ చేసే స్వాములకు ఉచితంగా నూతన వస్త్రాలు, మాలలు అందజేసి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. శ్రీశైల క్షేత్రానికి తరలివెళ్ళిన వారిలో శివస్వాములు, దేవాలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

About The Author: CHIRANJEEVI VADTHYA