నేటి నుంచి ఆల్ ఇండియా స్పీకర్ల సదస్సు

అఖిల భారత స్పీకర్ల సదస్సు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. 29 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతోపాటు ఆరు రాష్ట్రాల శాసన మండళ్ల చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్లు హాజరు కానున్నారు. 1925 ఆగస్టు 24న సెంట్రల్ లెజిస్లే టివ్ కౌన్సిల్ స్పీకర్గా ఎన్నికైన విఠల్బాయి పటేల్ స్మారకార్థం పోస్టల్ స్టాంప్ ను అమిత్ షా విడుద ల చేయనున్నారు. దేశంలో శాసనసభ చరిత్రను తెలియజేసే ఎగ్జిబిషను ప్రారంభిస్తారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగంతో స్పీకర్ల సదస్సు ముగుస్తుంది.

About The Author: SOMA RAJU

సోమరాజు గుమ్మడి, విశాఖపట్నం జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 3 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.