ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశం
ఇంటర్ విద్యార్థిని వర్షిత మృతిపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పాట్ ఎంక్వైరీకి ఆదేశాలు
హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 20:
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఫస్ట్ ఇయర్ ఇంటర్ విద్యార్థిని వర్షిత హైదరాబాద్‌లోని బాచుపల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ హాస్టల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యాయశాస్త్ర విద్యార్థి సభావట్ కళ్యాణ్ ఫిర్యాదు చేయగా, దానిని పరిశీలించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేసును స్వీకరించింది. తెలంగాణలోని ప్రైవేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల మృతులు పునరావృతమవుతున్నాయన్న ఆరోపణలను కమిషన్ గమనించింది. అధిక విద్య ఒత్తిడి, మానసిక వేధింపులు, కౌన్సెలింగ్ లోపం, హాస్టల్ నిర్వహణలో నిర్లక్ష్యం వంటి కారణాలతో విద్యార్థుల జీవన హక్కు, గౌరవంతో జీవించే హక్కు (భారత రాజ్యాంగం ఆర్టికల్ 21) ఉల్లంఘనకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ డీజీ (ఇన్వెస్టిగేషన్) ఆధ్వర్యంలో స్పాట్ ఎంక్వైరీ నిర్వహించి రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని కమిషన్ ఆదేశించింది.