తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన

తెలంగాణ రాజకీయ వేధింపుల ఆత్మహత్య కేసుపై ఎన్‌హెచ్ఆర్సీ (NHRC) స్పందన

నాలుగు వారాల్లో చర్యా నివేదిక సమర్పించాలని ఆదేశం

హైదరాబాద్ పెన్ పవర్ అక్టోబర్ 22:

తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో రాజకీయ వేధింపుల కారణంగా జరిగినదిగా ఆరోపణలు ఉన్న ఆత్మహత్య కేసుపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) స్పూర్తిదాయక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు మంచిర్యాల జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు (SP) ఆదేశాలు జారీ చేసి, నాలుగు వారాల్లో చర్యా నివేదిక (ATR) సమర్పించాలని సూచించింది. ఈ ఫిర్యాదును న్యాయ శాస్త్ర విద్యార్థి సభావట్.కళ్యాణ్ 12 అక్టోబర్ 2025న ఎన్‌హెచ్ఆర్సీకి సమర్పించారు. మానవ హక్కుల సంఘం 17 అక్టోబర్ 2025న ఈ ఫిర్యాదును పరిశీలించి విచారణకు స్వీకరించింది. ఫిర్యాదుదారు పేర్కొన్న ప్రకారం, కొందరు ప్రత్యర్థి కాంగ్రెస్ నేతల మానసిక వేధింపుల కారణంగా బాధితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఈ ఘటనపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా, బాధితుడికి న్యాయం చేయాలని, నిష్పక్షపాత విచారణ జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ కేసు మానవ హక్కుల ఉల్లంఘనతో పాటు రాజకీయ వేధింపుల కోణంలో సీరియస్‌గా పరిగణిస్తున్నట్లు ఎన్‌హెచ్ఆర్సీ స్పష్టం చేసింది.

About The Author: CHIRANJEEVI VADTHYA