గంగవరం, పెన్ పవర్ ఆగస్టు 18 :- అన్ని మండలాలలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు సిబ్బంది వర్షాలు తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా సింహాచలం సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గంగవరం మండలం నెల్లిపూడి గ్రామ సమీపంలోని మెయిన్ రోడ్డు కల్వర్టును రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి కట్టా సింహాచలం, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, రంపచోడవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సాయి ప్రశాంత్ లు కల్వర్టును పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షించడం జరిగింది. ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కట్టా.సింహాచలం మాట్లాడుతూ భారీ వర్షాలు కారణంగా వాగులు వంకలు పొంగే ప్రమాదం ఉందని వర్షాలు తగ్గేవరకు కాలువలు ఎట్టి పరిస్థితుల్లో దాటువద్దని ఆయన అన్నారు. ఏజెన్సీలో అన్ని మండల కేంద్రాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా రంపచోడవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వరదలకు సంబంధించిన సమస్యలు తెలియజేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఏజెన్సీలోని పర్యటక ప్రాంతాలన్నీ వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గేవరకు పర్యటకులకు ఎట్టి పరిస్థితుల్లో పర్యటక ప్రాంతాలకు అనుమతించడం జరగదని ఆయన అన్నారు. అన్ని మండలాలలో భారీ వర్షాల కారణంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులకు సిబ్బందికి అప్రమత్తం చేసి ముఖ్యమైన ప్రాంతాలలో డ్యూటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ అధికారుల వెంట తహసిల్దార్ సిహెచ్ శ్రీనివాసరావు, గంగవరం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.