ఆ నాలుగు శాఖలకు..! ప్రైమార్క్ దిమ్మతిరిగే ట్విస్ట్..

డామిట్ కథ అడ్డం తిరిగింది..! అధికారులకు ప్రైమార్క్ షోకాజ్ నోటీసులు..!

మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! ఈ ధోరణితో తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ట్విస్ట్ ఇచ్చిన ప్రైమార్క్..మేం అధికారులం..! మేం ఏం చెబితే అదే చట్టం..! తెలంగాణలో సిస్టమ్ శిధిలావస్థకు చేరుకుంది..? ప్రశ్నించే తత్వం మూగ బోయింది..? అధికారుల్లో జవాబుదారీతనం కనుమరుగైంది.. ఒక చెరువు నాలా కబ్జా వ్యవహారంలో సర్వేయర్ చేతివాటం..! ఆ గ్రామస్తులకు శాపంగా తయారైంది.. దుండిగల్‌ మండలంలో సర్వేయర్ శ్రీనివాస్‌చారి, అప్పటి తహశీల్దార్ కలిసి (2019లో) తప్పుడు స్కెచ్‌ప్లాన్ జారీతో హెచ్ఎండిఏ అనుమతులు లభించాయి.. ఒక తప్పు పది తప్పులను ప్రేరేపిస్తుందని, ప్రైమార్క్ నాలా కబ్జాతో నిరూపితమైంది.. సర్వేయర్ చేసిన తప్పును సక్రమం చేసేందుకు, మిగతా నాలుగు శాఖల అధికారులు తప్పుమీద తప్పు చేస్తూనే ఉన్నారు.. లాభాన్ని అర్జించకుండా సాధ్యం కాదుకూడా..! అదే ఇప్పుడు అధికారులకు రివర్స్ అయింది.. అధికార యంత్రాంగం సూచనలతోనే జరిగిందో..! లేక ప్రైమార్క్ నిర్మాణ సంస్థ అతితెలివి ప్రదర్శించిందో..! తెలియదు కానీ..! అధికారులు తమకుతామే ఉచ్చు బిగించుకున్నామని లోలోపల ఆందోళన చెందుతున్నట్టు స్పష్టమవుతుంది.. ప్రైమార్క్ నిర్మాణ సంస్థ, తన పబ్బం గడుపు కోవడానికి "నయానో బయానో" అధికారులను ప్రలోభాలకు పెట్టి.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన వెంటనే ప్రైమార్క్ యాజమాన్యం తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. బహుదూర్‌పల్లి నాలా కబ్జా వ్యవహారంలో అధికారులకు ప్రైమార్క్ ట్విస్ట్ ఇచ్చింది..

కరెప్షన్ అధికారుల నిర్వాకం..! సిఫార్సులకే ప్రాధాన్యత..! నాలాపై ప్రైమార్క్ ఎ-బ్లాక్..

బ్యాంకు లోన్‌ల నెపంతో.. ప్రైమార్క్ హైరైజ్ టవర్‌‌ను కాపాడే దిశగా పావులు..?

హైకోర్టు గడువు ఆరు నెలలు ముగిసిందని హైడ్రా అత్యవసర సమావేశం..!

నాలా డైవర్షన్‌లో 'హైడ్రా'మా..! 15 రోజుల గడువు విధించిన హైడ్రా కమిషనర్..

నాలా మళ్ళింపుకి అయ్యే ఖర్చు అంచనా వేసి, ప్రైమార్క్‌కి నోటీసులు జారీ..

జారీచేసిన నోటీసులతో హైకోర్టును ఆశ్రయించి వక్రబుద్ది ప్రైమార్క్..

కళ్ళెదుటే నాలా కబ్జా సాక్షాత్కరిస్తున్నా.! చర్చలు, సమావేశాలతో కాలయాపన చేస్తున్నారు..

ప్రైమార్క్ హైరైజ్ టవర్‌ ఎ-బ్లాక్.. ఆ చెరువు నాలాపైనే ఉంది..17 గుంటల స్థలం..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, అక్టోబర్ 21:

 

అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టడం..! డామిట్ కథ అడ్డం తిరిగింది..! అనే కొన్ని సామెతలు వినే ఉంటారు.. ఈ నానుడికి ప్రైమార్క్ నిర్మాణ సంస్థ నిర్వాకం అద్దం పట్టింది.. మరోవైపు నాలుగు శాఖల అధికారులకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చింది.. నిజానికి తప్పుడు అధికారులకు ఇలాంటిది జరగాల్సిందే.. మేడ్చల్ జిల్లా దుండిగల్‌ మండలం, దుండిగల్‌ మున్సిపల్ పరిధిలోని బహుదూర్‌పల్లి ప్రైమార్క్ హైరైజ్ టవర్‌ల నిర్మాణానికి 2019లో అమ్ముడు పోయిన దుండిగల్‌ మండల సర్వేయర్ తప్పుడు స్కెచ్‌ప్లాన్‌తో సులభంగా హెచ్ఎండిఏ పర్మిషన్‌ లభించింది.. ఆతర్వాత మున్సిపల్, ఇరిగేషన్, అధికారులు కూడా,అడ్డు చెప్పలేక, ప్రైమార్క్ ముడుపులు స్వీకరించక తప్పలేదేమో..!ఈ నాలుగు శాఖల సహకారంతో బాబాఖాన్ లేక్ఐడి నెం.2856 చెరువు నాలాను 17 గుంటలు (2000 గజాలు) కబ్జాచేసిన ప్రైమార్క్ యాజమాన్యం, సంబంధిత శాఖలతో పాటు, బాధితులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు మొత్తం 20 మందికి ఏకంగా హైకోర్టు నుండి షోకాజ్ నోటీసులు పంపించడం విశేషం.. ప్రైమార్క్ యాజమాన్యం అసలు నోటీసులు పంపించడానికి కారణం ఏంటి..? అధికారుల నిర్లక్ష్యమా..? లేక ప్రైమార్క్ అక్రమార్కులు అతితెలివి ప్రదర్శిస్తున్నారా చూద్దాం..

2025 మార్చి 13న హైకోర్టు ఆదేశాలతో.. ప్రైమార్క్ కబ్జాను సందర్శించిన హైడ్రా కమిషనర్.. ఫైల్‌ఫోటో..

 

పరిష్కారం చూపమని హైడ్రాకు అప్పగించిన హైకోర్టు..

 

బహుదూర్‌పల్లి శ్రీరామ అయోధ్య విల్లా వాసులను ముంపు భారి నుండి కాపాడాలని బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.. దాదాపు ఏడాదిన్నర తర్వాత.. విల్లాల ప్రజలకు వరద ముంపు భారీ నుండి కాపాడేందుకు, తక్షణ చర్యల్లో భాగంగా, 2025 ఫిబ్రవరి 5న  సమస్య పరిష్కరించాలని, తెలంగాణ హైకోర్టు (జస్టిస్ కె.లక్ష్మణ్) హైడ్రా కమిషనర్‌ను ఆదేశించింది.. అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రైమార్క్ యాజమాన్యం భరించాలని, నాలుగు వారాల్లో,ఇరువురితో (బాధితులు- ప్రైమార్క్) పాటు నాలుగు శాఖల అధికారులతో సమావేశమై, 6 నెలల్లో సమస్య పరిష్కరించాలని హైకోర్టు ఆర్డర్‌లో పేర్కొంది..

నాలా మళ్ళింపు అంచనా వ్యయం జారీతో.‌. ప్రైమార్క్ యాజమాన్యం హైకోర్టు నుండి నోటీసులు..

 

హైడ్రా అంటే లెక్కలేదా..! హైకోర్టు ఆదేశాలు  అనుసరించరు..!

 

తెలంగాణ హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో..! నెల ఆలస్యం అయినప్పటికీ, గత నెల (2025 సెప్టెంబర్)లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, సంబంధిత శాఖల అధికారులు, బాధితులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు.. కబ్జా చేసిన నాలా స్థలం సంగతి ఏమో కానీ..! వరద నీరు మళ్ళింపు ప్రక్రియకు వ్యయాన్ని అంచనావేసి, ఆ ఖర్చును ప్రైమార్క్ భరించాలని, ఇది హైకోర్టు ఆదేశాలుగా సమావేశంలో హైడ్రా‌ కమిషనర్ పేర్కొన్నారు.. గత నెల( 2025 సెప్టెంబర్ 22న) ప్రైమార్క్‌కి జారీచేసిన లేఖలో నాలా డైవర్షన్‌కి అంచనా వ్యయం రూ.26.10 కోట్లు భరించాలని నోటీసులో పేర్కొనడంతో, ప్రైమార్క్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించి 20 మందికి షోకాజ్ నోటీసులు జారీచేశారు.. అందులో “ఎ-బ్లాక్" నిర్మాణం నాలా మీద ఉందని నోటీసులో పసూచించారు.. 22.09.2025 తేదీన జారీ చేసిన నోటీసు (Letter No. EU/Primark/135/2025-26) ను తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.. ప్రస్తుతం ఆ నోటీసు అమలులో ఉండదని.. కేసును ఈనెల 31 అక్టోబర్ 202కు వాయిదా ఉందని పేర్కొన్నారు..

 

 

 

 

 

 

చెరువు నాలాపై నిర్మించిన (2000 గజాల స్థలం) కబ్జాతో రూ.50-60 కోట్లు విలువైన 88 ఫ్లాట్‌లు గల హైరైజ్ టవర్‌‌ను, కాపాడేందుకే, ఆ 4 శాఖల అధికారులు ఉత్సుకత ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.. 6 నెలల వ్యవధిలో సమస్య పరిష్కరించాలని హైకోర్టు హైడ్రాను ఆదేశించింది.. హాస్యాస్పద విషయం ఏమిటంటే..! కేసు విచారణ హైడ్రాకు అప్పగించి, హైడ్రా కమిషనర్ విజిట్ చేసిన 6 రోజులకే (2025 మార్చి 13న విజిట్- మార్చి 19న 'ఓసీ) "అక్రమార్కులకు (ప్రైమార్క్‌కి) హెచ్ఎండిఏ "ఆక్యుపెన్సీ సర్టిఫికేట్" జారీ చేయడం గమనార్హం.. మరోవైపు కోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో..! హైడ్రా కమిషనర్ గత నెల అక్టోబర్‌లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.. నాలా డైవర్షన్‌కి అయ్యే వ్యవయాన్ని అంచనా వేయమని, సంబంధిత అధికారులకు 15 రోజుల వ్యవధితో ఆదేశించడం విశేషం.. ఈ ఆరు నెలల్లో చేయలేనిది, ఈ పదిహేను రోజుల్లో పరిష్కారం అవుతుందా..? పరిష్కారం సంగతేమో కానీ..! నాలా డైవర్షన్ వ్యయం నోటీసు పుచ్చుకున్న, ప్రైమార్క్‌ యాజమాన్యం, హైకోర్టు నుంచి 'స్టే' ఆర్డర్‌తో అందరికీ నోటీసులు జారీ చేశారు.. ఏదిఏమైనప్పటికీ "సహజ సిద్దమైన వనరులు" కబ్జాకు గురవుతుంటే..! పలుకుబడి ఉన్నోళ్ళ పంచన చేరి చర్యలు విస్మరించారు..! నాలా డైవర్షన్ ప్రక్రియకు సూచించిన "వ్యయంపై" ఒత్తిడిని నిలిపివేయాలని హైకోర్టు ఆదేశాలతో, అధికార యంత్రాంగం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

 

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.