దుండిగల్ మున్సిపల్ బౌరంపేట్ సింహపురి కాలనీలో పార్కులు బహిరంగ విక్రయం..
1998లో లేఅవుట్ పార్కులను 2024 లో అక్రమ రిజిస్ట్రేషన్‌లు..ఫెన్సింగ్ ఏర్పాటు..
పెన్ పవర్ దినపత్రికలో గతేడాది 2024 ఆగష్టు 28న వార్తా కథనం..
2024 ఆగష్టు 29న టౌన్‌ప్లానింగ్ అధికారి సమక్షంలో ఫెన్సింగ్ కూల్చివేతలు..
నేటికీ రిజిస్ట్రేషన్‌ల రద్దుకు చర్యలు చేపట్టని దుండిగల్ మున్సిపల్ అధికారులు..
సంబంధిత అధికారులతో పాటు..! హైడ్రా చుట్టూ తిరుగుతున్న కాలనీ ప్రజలు..
ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న కాలనీ అసోసియేషన్ సభ్యులు.. బాధ్యతా రహితం..
బ్లాకులన్నింటికీ ఒకే అసోసియేషన్ పెత్తనం..! 'డి' బ్లాకు పార్కుని కమర్షియల్ చేసే యోచనపై వ్యతిరేకత..
తాము పార్కులను చూసే ప్లాట్‌లు కొనుగోలు చేశామని కాలనీ ప్రజల ఆవేదన..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, మే 11:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేట్ సింహపురి కాలనీ 1998 ఫిబ్రవరి 23న "హుడా" ఆమోదంతో లేఅవుట్ వేశారు..వెంచర్‌లో "ఏ నుండి ఎఫ్" వరకు బ్లాకులుగా విభజించిన వెంచర్ నిర్వాహకులు పార్కు స్థలాలతో పాటు.. భవిష్యత్తు ప్రజల వినియోగం దృష్ట్యా ఓపెన్ ప్లాట్‌లు, పార్కు స్థలాలను విశాలంగా కేటాయించారు.. "సర్వే నెం.440R, 441P, 442, 443, 444P నుండి 448P, 538B, 540 ఆఫ్ బౌరంపేట్ విలేజ్".. అండ్ బాచుపల్లి సర్వే నెంబర్ 149లో మొత్తం 89 ఎకరాల్లో 4,30,760 చదరపు గజాలతో వేసిన వెంచర్ నిర్మాణంలో.. 3.70 శాతం ప్రజా ప్రయోజనాల కోసం 15,950 చదరపు గజాలు కేటాయించారు.. 1998లో "హుడా" లేఅవుట్ పర్మిట్ నెం.12448/MP2/HUDA/1993.. ఆ తర్వాత రివైజ్డ్ పర్మిట్ నెం.12448/MP2/ H/ 1998 తేది:23-02-98.. దాదాపు 27 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన లేఅవుట్‌లోని ప్రజాప్రయోజనాలను, 2024 నుండి బై నెంబర్‌లతో రిజిస్ట్రేషన్‌లు చేస్తుంటే..! "పెన్ పవర్" దినపత్రికలో వచ్చిన వార్తా కథనంతో ప్రీకాస్ట్ ఫెన్సింగ్‌ను 24 ఆగష్టు 28న కూల్చివేసిన మున్సిపల్ అధికారులు, నేటికీ రిజిస్ట్రేషన్‌లు రద్దుచేయకుండా చోద్యం చూస్తున్నారు..
హైడ్రా కమిషనర్ జోక్యం చేసుకోవాలి:స్థానికులు
దుండిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేట్ సింహపురి కాలనీలోని పార్కు స్థలాలపై అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కులకు వరంగా మారింది.. 1998 లో "హుడా" ఆమోదం పొందిన లేఅవుట్‌లో పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయి.. ఎ-బ్లాక్‌లో పార్కు స్థలం కబ్జాచేసి దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంపై "పెన్ పవర్" దినపత్రికలో 2024 ఆగష్టు 28న వచ్చిన వార్తా కథనంతో, కమిషనర్‌తో కలిసి టౌన్‌ప్లానింగ్ అధికారిని సంజున ఆద్వర్యంలో పరిశీలించి కూల్చివేతలు చేపట్టిన అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయడానికి ప్రయత్నించక పోవడం విశేషం.. మరోవైపు అక్రమ రిజిస్ట్రేషన్ దారుడు హైకోర్టును సంప్రదించి 6 గురు రెస్పాండెంట్స్‌కి షోకాజ్ నోటీసులు పంపించడం గమనార్హం.. దీనంతటికి పార్కు కబ్జాను ప్రోత్సహించిన అధికారులే కారణంగా ఆరోపిస్తున్నారు.. 27 ఏళ్ళనాటి హుడా లేఅవుట్‌లోని పార్కులను, ప్రజా ప్రయోజనాల స్థలాలను కాపాడలేని అధికారులుగా పరిగణించాలా..? అధికారుల ప్రమేయం లేకుండా ఇదంతా సాధ్యమేనా..? పార్కుల ప్రత్యేక పరిరక్షణకై ఏర్పడిన హైడ్రా కమిషనర్ పట్టించుకోవాలని స్థానికులు వేడుకుంటున్నారు..
పూర్తి వార్తా కథనాన్ని రేపటి పేపర్‌లో..