ఘనంగా అన్న ప్రసాద వితరణ : ముద్దగౌని సతీష్ గౌడ్
ఘనంగా అన్న ప్రసాద వితరణ : ముద్దగౌని సతీష్ గౌడ్
సతీష్ గురుస్వామి ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం
భారీ సంఖ్యలో పాల్గొన్న స్వాములు, భక్తులు
ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎల్బీనగర్ అడిషనల్ డీసీపీ కే. కోటేశ్వరరావు
ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 27
శ్రీ మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ గురుస్వామి గత 15 సంవత్సరాలుగా శివ స్వాములకు ఉచిత మాలాధారణ, 41 రోజుల వసతి, నిత్యాన్నదానం చేపడుతున్నారు. అదేవిధంగా ఈ సోమవారం కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీ మల్లికార్జున భక్త సమాజం అధ్యక్షులు ముద్దగౌని సతీష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎల్బీనగర్ జోన్ అడిషనల్ డీసీపీ కే. కోటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. అంతకుముందు అడిషనల్ డీసీపీని సతీష్ గురుస్వామి, వారి స్వాముల బృందం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ సతీష్ గురుస్వామి చేస్తున్న సేవలను కొనియాడారు. ముందు ముందు ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. తమను ఆహ్వానించి స్వామివారి సేవలో భాగం చేసినందుకు సతీష్ గురుస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
*సతీష్ గురుస్వామి మాట్లాడుతూ...*
శివతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా శ్రీ మల్లికార్జున భక్త సమాజం పనిచేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఉచిత మాలధారణ నిత్యాన్నదానం కొనసాగుతుందన్నారు. ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ చూపించిన మార్గంలో వెళ్తూ శివతత్వాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అతి త్వరలో 1000 మంది శివ స్వాములతో కాలినడకన శ్రీశైలానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు, భక్తులు పాల్గొన్నారు.