నోటీసులిచ్చిన అక్రమ షెడ్డుపై..! చర్యలేవి తహశీల్దార్ సాబ్..?

అదనపు కలెక్టర్ సార్ అడగలేరు..! ఆర్డీవో సారు పట్టించుకోరు..

 

227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుపై ఏడాది దాటినా..! చర్యలు శూన్యం..

బౌరంపేట్ సర్వే నెం.166 ప్రభుత్వ భూమిలో అక్రమంగా 40 ఫీట్ల సీసీరోడ్డు..

ఈ రెండు చోట్ల నోటీసులిచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ చర్యలు శూన్యం..

అధికారుల్లో‌ నిజాయితీ..! విధుల్లో పారదర్శకత లోపిస్తే..!ఇలాగే ఉంటుందేమో..?

2024లో బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం..

2025లో బౌరంపేట్ 166 ప్రభుత్వ భుమిలో ఒప్పందపు సీసీరోడ్డు..

అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..*అధికారుల ముసుగులో కబ్జాదారులను మించి అక్రమాలకు పాల్పడుతున్నారా..? అసలు ఏం జరుగుతోంది..? ప్రశ్నించే వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కబ్జాదారులకు ధారాదత్తం చేస్తారా..? ప్రభుత్వ భూముల పరిరక్షణకు నియమించిన రెవెన్యూ వ్యవస్థ, పరోక్షంగా భూములను అమ్ముకుంటున్నారా.? 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలోనే ఉన్న బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో, ప్రముఖ బిల్డర్ సురేందర్ రెడ్డి, 400 గజాల్లో నిర్మించిన అక్రమ షెడ్డు నిర్మాణానికి, 353.35 ఎకరాలు పోరంబోకు భూమిగా నిర్ధారించి..! 2024 మే 7న పది రోజుల్లో చర్యలు తీసుకోబోతున్నట్లు నోటీసులు జారీచేసిన దుండిగల్‌ తహశీల్దార్, ఏడాది దాటినా షెడ్డుపై శాశ్వత చర్యలేవి..? చర్యలకు బదులు మరేదైనా తీసుకున్నారా..? ఇదిలా ఉండగా నోటీసులు ఇచ్చిన అదేచోట ప్రభుత్వ నిధులతో కబ్జాదారులకు సీసీరోడ్డు నిర్మాణానికి గత జిల్లా కలెక్టర్, ప్రస్తుత తహశీల్దార్ కీలంకంగా వ్యవహరించారు.. దుండిగల్‌ మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అధికారులే, ప్రధాన సూత్రదారులుగా, సర్వత్రా విమర్శలు వస్తున్నాయి..

227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుకు తహశీల్దార్ నోటీసులిచ్చి ఏడాదిన్నర..

 

మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, ఆగష్టు 28:

మేడ్చల్ జిల్లా దుండిగల్‌ మడలం, బహుదూర్‌పల్లిలో సర్వే నెం.227లో సుమారు రూ.30 వేలకోట్లు విలువైన 353.35 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాలో రెవెన్యూ అధికారులు చిత్రవిచిత్రంగా వ్యవహరిస్తున్నారు.. ఈ విషయంలో అధికార యంత్రాంగం అంతా బహిరంగంగానే సహకరించడం విశేషం.. ఈ వ్యవహారంలో కావల్‌కార్ నుండి కలెక్టర్ వరకు భాగస్తులే..? హాస్యాస్పద విషయం ఏమిటంటే..? సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు, తహశీల్దార్ నోటీసులు జారీచేసిన అదేచోట, సీసీరోడ్డు నిర్మాణం జిల్లా కలెక్టర్ సహా తహశీల్దార్ సహకరించడం గమనార్హం.. 22ఎ కింద నిషేధిత జాబితాలో ఉన్న 227 ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి, పంచాయతీరాజ్ ఎస్‌డిఎఫ్ నిధులకు ప్రతిపాదనలు, జిల్లా కలెక్టర్ ఆమోదం, స్థానిక తహశీల్దార్ అండ..! దొంగలు దొంగలు ఊర్లు పంచుకుతిన్న చందంగా తయారైందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ధరణీ లోపాలతో, అక్రమ రిజిస్ట్రేషన్‌లు చేసిన రెవెన్యూ అధికారులు..! భూ భారతి చట్టం అమలులోకి వచ్చాక కూడా అక్రమ రిజిస్ట్రేషన్‌లు రద్దుచేయడానికి వెనకడుగు వేయడం ఎందుకు..? తప్పుడు ధరణిని‌ పరిగణలోకి తీసుకొని, చేసిన రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడంలో, జాప్యం దేనికి.? తీసుకున్న ముడుపులు అడ్డొస్తున్నాయా..? అదే 353.35 ఎకరాలు ప్రభుత్వ పోరంబోకు భూమిగా అక్రమ షెడ్డుకు నోటీసులిచ్చిన తహశీల్దార్, చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో జిల్లా అధికారులే తేల్చాలి..  

 

227 ప్రభుత్వ భూమిలో రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో అక్రమ సీసీరోడ్డు..

 

ధరణీ తప్పుల తడక అన్నారు..! తప్పుడు రిజిస్ట్రేషన్‌ల రద్దేది..?

ధరణీ తప్పుల తడక అన్నారు.. నిజమే సమస్యలు ఎన్నో తలెత్తాయి..! ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ప్రభుత్వ భూములు అక్రమార్కులకు అప్పనంగా కట్టబెట్టేందుకు మాత్రం, ధరణీ చట్టంలోని లోపాలు పరిగణలోకి తీసుకుని, నిషేధిత ప్రభుత్వ భూమిలో, సుమారు 200 ఎకరాలు రిజిస్ట్రేషన్‌లు చేసిన అధికారులపై చర్యలేవి.?బహుదూర్‌పల్లి సర్వే నెం. 227 పోరంబోకు భూమిని ధరణీ రిజిస్ట్రేషన్‌ల ద్వారా అక్రమార్కులకి కట్టబెట్టడానికి మాత్రమే ధరణీ చట్టం వర్తిస్తుందా..? ధరణీ చట్టాన్ని తప్పుల తడకగా భావించిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం..! ప్రజా అభీష్టం మేరకు, భూ భారతి చట్టాన్ని అమలు చేశారు బాగుంది.. ప్రత్యామ్నాయాన్ని గుర్తించి నందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయాలి..! అదే సమయంలో, ప్రభుత్వ భూమిని ధరణీ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడంలో వెనకడుగు దేనికి..? ఈ ధరణీ లోపాలను, సీసీఎల్ఏ కమిషనర్ నుండి జిల్లా కలెక్టర్‌లు, తహశీల్దార్‌ల వరకు అందరికీ తెలిసిందే..! అందుకేనా..! 25 ఏళ్ళుగా హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ..! ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ (ఐఏఎస్) చదివిన అధికారులు  హైకోర్టును ధిక్కరించి..! సర్వే నెం.227 ప్రభుత్వ (పోరంబోకు) భూమిలో 2022 నుండి 2023 వరకు ధరణీ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ పూర్తి చేశారు..! ధరణీ రిజిస్ట్రేషన్‌లు పట్టా పాసు బుక్కులు, నాలా కన్వర్శన్‌లు జారీ చేయడాన్ని ఏవిధంగా చూడాలి..? అధికార దుర్వినియోగానికి పాల్పడి..? ధరణీ లోపాలను భాగానే వాడుకున్నారని అనుకోవాలా..?

బౌరంపేట్ 166 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు నిర్మాణం..

 

బౌరంపేట్ 166 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డు..

రాజు తలచకుంటే దెబ్బలకు కొదవలేదు..! ప్రభుత్వ అధికారులు తలచుకుంటే కబ్జాలకు అడ్డులేదు..! ప్రభుత్వ భూముల్లో అక్రమార్కులకు సీసీరోడ్లు వేయాలంటే కాస్త పలుకుబడి ఉంటే చాలు..! ఎలాగో అవినీతి అధికారులు దండిగానే ఉన్నారు కాబట్టి..! రెవెన్యూ అధికారులను ప్రసన్నం చేసుకుంటే..! ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవడం పెద్ద పనేమికాదని నిరూపిస్తున్నారు దుండిగల్‌ రెవెన్యూ అధికారులు..మున్సిపల్ "కమిషనర్-అండ్ తహశీల్దార్" విధుల నిర్వహణతో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతోంది..? చట్టాలు అంటే విలువ లేదు..! ప్రభుత్వ విధులంటే బాధ్యత లేదు..! అధికారికంగా, చట్టపరంగానే జారీచేసిన నోటీసులను సైతం, తహశీల్దార్ మతీన్ చిత్తు కాగితాల వలె భావిస్తున్నారు.. బహుదూర్‌పల్లి 227 ప్రభుత్వ భూమిలో అక్రమ షెడ్డుకు నోటీసులు ఇచ్చిన తహశీల్దార్,  ఏడాది గడిచినా చర్యలు తీసుకోకపోయినా అదనపు కలెక్టర్, ఆర్డీవో ప్రశ్నించలేరనే ధీమాతో చర్యలపై నిర్లక్ష్యం వహిస్తుండగా..!  బౌరంపేట్ సర్వే నెం.166/1, 166/3, ప్రభుత్వ భూమి విషయంలోనూ తహశీల్దార్ అదే ధోరణితో వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోంది ..! "ఆపరేషన్ 166 @ 40" ఫీట్ల రోడ్డు కోసమే..! తహశీల్దార్‌‌‌ను  బదిలీ చేయకుండా మాజీ కలెక్టర్ సిఫార్సులు ఉన్నట్టు సమాచారం.. 2025 ఫిబ్రవరి 20న నోటీసులు ఇచ్చిన దుండిగల్‌ తహశీల్దార్ మతీన్..! అక్రమ సీసీరోడ్డు కోసం మున్సిపల్ కమిషనర్ లేఖకి, స్పందించి అదే 166 ప్రభుత్వ భూమిలో అక్రమ సీసీరోడ్డుకు హద్దులు గుర్తించి, స్కెచ్‌ప్లాన్ ఇవ్వడం గమనార్హం..   

 

About The Author: MADHAV PATHI

మాధవ్ పత్తి,   మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక  రంగాలకు సంబంధించి  ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.