దుండిగల్ రెవెన్యూ సర్వేయర్ శ్రీనివాస్ చారి 2019లో తప్పుడు స్కెచ్‌ప్లాన్‌తో షురూ..
ప్రైమార్క్‌కి హెచ్ఎండిఏ అనుమతులకు కీలకంగా మారిన సర్వేయర్ స్కెచ్‌ప్లాన్..
ఇక ఇరిగేషన్ అధికారుల సంగతి తెలిసిందే కదా..! చెరువుల కబ్జాల్లో కీలకపాత్ర..
వాల్టా యాక్ట్‌ను అమలు చేయాల్సిన నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం..!*
*ప్రైమార్క్ ఆక్రమణలో చెరువు నాలా రెండు వేల గజాల స్థలంలో ఎ-బ్లాక్ టవర్..
కబ్జా దారులు ప్రైమార్క్ నిర్మాణ సంస్థ వద్ద తీసుకున్న ముడుపులకు తలొగ్గి..?
నాలుగు శాఖలు ఒక్కటై..! అక్రమం సక్రమం అయ్యేవరకూ మూడేళ్ళు సర్వేలు..
"తిలాపాపం తలాపిడికెడు"గా ఆ నాలుగు శాఖల సమన్వయంతో నాలాపై ప్రైమార్క్..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, సెప్టెంబర్ 14:
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో చెరువులు, కుంటలు, కట్టుకాలువలు, ప్రభుత్వ భూముల పరిస్థితి దయనీయంగా మారింది.. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం.. పార్టీలు వేరైనా పాలకుల ధ్యేయం ఒక్కటేనని రుజువైంది.. ఎటొచ్చీ ప్రజలే జోకర్‌లుగా భావిస్తున్నారు కాబోలు.. ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన "నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం- నేటి కాంగ్రెస్ ప్రభుత్వం" తీరు ఒకేలా ఉంది..మరోవైపు ప్రభుత్వ శాఖల్లో, ఏడాదికి ఏడాది పారదర్శకత, నిజాయితీ లోపిస్తోంది..! అవినీతికి ప్రత్యామ్నాయంగా తయారైంది..! ఇదంతా బహిరంగమే అయినప్పటికీ..! "రాజకీయ నాయకులు- అధికారులు" ఒక్కటై దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకునే నానుడికి అద్దం పడుతున్నారు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఏ చెరువును పరిశీలించినా, ఏ కట్టుకాలువలు చూసినా బడా నిర్మాణ సంస్థల ఆధీనంలోనే భద్రంగా ఉండటం విశేషం.. ఎటొచ్చి సామాన్యులే సమిథలు అవుతున్నారు.. ఈ వ్యవహారం ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అంటే, అదేమి కాదు..! కొందరు తప్పుడు అధికారుల నేతృత్వంలోనే ఈ ప్రభుత్వ భూములు, చెరువులు, కట్టుకాలువలు, చెరువు నాలాలు కబ్జాలకు గురవుతున్నాయి అనేది పచ్చి నిజం..! ఒక్క మాటలో చెప్పాలంటే..! అధికారులే ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకునే స్థాయికి దిగజారారు అనడంలో అతిశయోక్తి కాదు.. బీఆర్ఎస్ ధరణీ చట్టంతో దోచుకుందని.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని అమలు చేసింది.. ధరణీ చట్టాన్ని తప్పుబట్టి, భూ భారతిని తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ ధరణీ లోపాలతో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్‌లు రద్దు చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తోంది..?
బహుదూర్‌పల్లి బాబాఖాన్ చెరువు నాలా భూ స్థాపితం..
దుండిగల్ మండలం, దుండిగల్ మున్సిపల్, బహుదూర్‌పల్లి గ్రామ పరిధిలోని బాబాఖాన్ లేక్ఐడి నెం.2856 చెరువు నాలాను భూ స్థాపితం చేశారు.. నాలుగు శాఖల లంచగొండి అధికారుల నేతృత్వంలో, చెరువు నాలా స్థలం కబ్జాకు, ప్రైమార్క్ హైరైజ్ టవర్‌ల నిర్మాణానికి, రోడ్డుకు అవతల తెరలేపగా..! అదే నాలా స్థలం (నేటి పత్రికలో నాలా దృశ్యాల స్థలంలో) రోడ్డుకు ఇవతల ఓ భారీ షెడ్డు నిర్మించారు.. ఈ వ్యవహారంలో ఒకవైపు మున్సిపల్ టౌన్‌ప్లానింగ్..! మరోవైపు ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల చేతివాటం స్పష్టంగా కనిపిస్తుంది.. వందల ఏళ్ళనాటి విలేజ్ నక్షలో ఉన్న ఈ చెరువు నాలా కబ్జాపై అధికారులు, తమ వక్రబుద్దిని ప్రదర్శిస్తున్నారు.. ఇప్పటికే హైదరాబాద్ మహానగరం వ్యాప్తంగా, బడా నిర్మాణ సంస్థల ఆక్రమణలకు సహకరిస్తూ..! హైడ్రా విధివిధానాల్లో మార్పులు చేసిన, కాంగ్రెస్ ప్రభుత్వం.. బహుదూర్‌పల్లి బాబాఖాన్ చెరువు నాలాను భూ స్థాపితం చేయడంలో విజయవంతం అయ్యారని చెప్పాలి.. మానవ మనుగడకు ప్రమాదం తలపెట్టే విధంగా, తయ్యారైన ఈ అక్రమార్కులకు చెక్ పెట్టాలంటే..! ఒకటే పరిష్కారం..! బాధ్యులైన సంబంధిత శాఖల అధికారులను విధుల నుండి తొలగిస్తేనే, చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు పరిరక్షింప బడుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు..