మండలంలో తహశీల్దార్ మతీన్ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు..దుండిగల్ మండలంలో తహశీల్దార్ మతీన్ ప్రభుత్వ భూములు అంటూ నోటీసులు ఇవ్వడం..! కబ్జాదారులు, అక్రమ నిర్మాణాల నుండి తాంబూలం పుచ్చుకోవడం కొత్తేమి కాదు..! ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళినా..! పలుకుబడితో బదిలీని కూడా రద్దుచేసుకునే సత్తా, సారుకు ఉందని, ఇక్కడే విధుల్లో కొనసాగడానికి, తీవ్ర కృషి చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. తహశీల్దార్ మతీన్ నోటీసుల డ్రామా వ్యవహారం మచ్చుకు కొన్ని "పెన్ పవర్" దినపత్రిక పాఠకుల కోసం ఈరోజు.. బహుదూర్‌పల్లి సర్వే నెం.227 ప్రభుత్వ భూమిలో 400 గజాల్లో సురేందర్ రెడ్డి అక్రమ షెడ్డుకు 2024 మే 7న నోటీసులు జారీచేసిన తహశీల్దార్..ఏ కారణం లేకుండానే ఏడాదిన్నర గడిచినా చర్యల్లేవు.. ఆ తర్వాత ఈ తహశీల్దార్ మరో ఘనకార్యం కూడా చేశారు.. 227 ప్రభుత భూమిలో నోటీసులు జారీ చేసిన చోటనే.. స్థానిక ఎమ్మెల్యే కబ్జాదారులకు, ప్రభుత్వ నిధులు రూ.60 లక్షలు (ఎస్‌డిఎఫ్) నిధులతో సీసీరోడ్డు మంజూరు చేయిస్తే..! తహశీల్దార్ మతీన్ హైకోర్టును ధిక్కరించి, బాధ్యతా రహితంగా ప్రభుత్వ భూమిలో సీసీరోడ్డు నిర్మాణానికి సహకరించారు..
బౌరంపేట్ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్ ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం
స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..*బౌరంపేట్ సర్వే నెం.166/1, 166/3 లావణ్య పట్టా భూమి క్రయ విక్రయాలు, చిన్న షెడ్డు నిర్మాణ వ్యవహారంలో..! 2025 ఫిబ్రవరి 20న రెండు నోటీసులు ఇచ్చిన దుండిగల్ తహశీల్దార్ మతీన్..! అదే స్థలాన్ని రెండు బడా నిర్మాణ సంస్థలకు కట్టబెట్టి సీసీరోడ్డు నిర్మాణం చేపట్టడంలో, సారు కీలకంగా సహకరించారు.. మరికొన్ని ప్రభుత్వ భూముల వ్యవహారంలోనూ, ఎన్‌వోసిలు ఇచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న తహశీల్దార్.. ఓ గిరిజనుడి నుండి రూ.6 లక్షలు డిమాండ్ చేసి, లంబాడ యువకుని ఆత్మహత్యాయత్నానికి కారకుడు అయ్యాడని బాధితుని ఆరోపణలతో బట్టబయలు అయింది.. తన భూమిని "బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నంపై తనకు న్యాయం కావాలంటూ బాధితుడు సిద్దూ నాయక్ ఆవేదనతో..! దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది..
రెండేళ్లుగా పాస్ బుక్ ఇవ్వకుండా తహశీల్దార్ వేధింపులు..!
బడా నిర్మాణ సంస్థకు భూమి అమ్మాలని తహశీల్దార్ ఒత్తిడి: బాధితుడు..
పోలీసుల మధ్యవర్తిత్వంతో దిగి వచ్చిన తహశీల్దార్ మతీన్..
త్వరలో రైతుకు పాస్ బుక్కులు ఇస్తామని హామీ..
తహశీల్దార్ మతీన్ ప్రభుత్వ భూములు కట్టబెట్టడంలో ప్రజ్ఞాశాలి అంటూ పలు ఆరోపణలు..
తిననేర్చిన కోడి ఇళ్ళు పైకెక్కి కూసిందట.. అలా ఉంది తహశీల్దార్ మతీన్ వ్యవహారం..
దుండిగల్ తహశీల్దార్ కార్యాలయం ముందు బైటాయించిన బాధిత కుటుంబం..
మేడ్చల్ జిల్లా బ్యూరో, పెన్ పవర్, అక్టోబర్ 14:
దుండిగల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యా యత్నం స్థానికంగా కలకలం రేపింది.. తమ తాతలు తండ్రుల నుండి అనుభవిస్తున్న భూమి విషయంలో అన్యాయం జరిగిందంటూ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన దుండిగల్ పోలీసులు అడ్డుకొని ప్రాణాపాయం నుంచి కాపాడారు.. ఘటన వివరాల్లోకి వెళ్ళితే.. దుండిగల్-1 తాండాకు చెందిన బానోతు సిద్దూ నాయక్ (27) తన భూమిని మండల తహసీల్దార్ సయ్యద్ అబ్దుల్ మతీన్ ఓ బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నాడని పత్రికా ముఖంగా ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని, పాస్‌బుక్‌లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని ఆత్మహత్యా యత్నాన్ని అడ్డుకున్నారు..
తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..
బాధితుడు సిద్దూ నాయక్ ఆరోపణలు..
గాగిల్లాపూర్ గ్రామ శివారు సర్వే నెంబర్ 148/ఇ – 5 గుంటలు, సర్వే నెం. 150/ఇ – 2 గుంటలు.. 1950 నుండి కుటుంబ వారసుల పేర్లలో ఉన్నాయని తెలిపారు.. 2006లో ఆర్ఓఆర్ ప్రొసీడింగ్ నెంబర్ 2037/06 ప్రకారం తమ పేర్లకు బదిలీ అయ్యిందని బాధితులు పేర్కొన్నారు.. పట్టా నెంబర్‌లు 614, 615 ద్వారా పాస్‌బుక్‌లు జారీ అయినప్పటికీ, అధికారులు వాటిని ఇవ్వకుండా ఆటలు ఆడుతున్నారని ఆరోపించారు.. 7 గుంటల స్థలానికి పాస్‌బుక్‌ల కోసం తహశీల్దార్ మతీన్ రూ.6 లక్షలు లంచం అడిగారని, ఇవ్వకపోవడంతో, ఇలా ఇబ్బందులు పెడుతున్నాడని బాధితుడు సిద్దూ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్ 2023-96, 2023-97 ప్రకారం భూదాన్ ల్యాండ్ కాదని తేలిందని సిద్దూ నాయక్ మీడియాతో తెలిపారు..
ఏదిఏమైతేనేమి పోలీసుల జోక్యంతో ఓ నిండు ప్రాణం కాపాడారు, బాధితునికి పరిష్కార మార్గం కూడా లభించిందని, పోలీసులు తహశీల్దార్ మతీన్‌తో ప్రాస్తావించి సమస్యను పరిష్కరించారు..సిద్దూ నాయక్‌ను ఆందోళన నుండి విరమింపజేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది.. అదేవిధంగా పోలీసులు తహసీల్దార్‌తో చర్చలు సఫలీకృతం అయ్యాయి.. దుండిగల్ ఎమ్మార్వో బాధితులకు త్వరలో పాస్‌బుక్‌లు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.. దీంతో రెండేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు పరిష్కార మార్గం దొరికిందని పలువురు హర్షం వ్యక్తం చేశారు..
About The Author: MADHAV PATHI
మాధవ్ పత్తి, మెడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. రెవిన్యూ, విద్య, ఆరోగ్యం, సామజిక రంగాలకు సంబంధించి ఆయనకు జర్నలిజంలో 24 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.