యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఉషారాణి

వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, నో ఆల్కాహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్

యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఉషారాణి

వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, నో ఆల్కాహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్

పోస్టర్ ను ఆవిష్కరించిన ఉషారాణి

హైదరాబాద్ పెన్ పవర్ డిసెంబర్ 02 :

డ్రగ్స్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధాన్ని ప్రకటించాయి. అందులో భాగంగా వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో డ్రంక్ అండ్ డ్రైవ్ పేరుతో సమరాన్ని ప్రకటించింది. వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ ఆధ్వర్యంలో నో డ్రగ్స్, మద్యం నుండి యువతను కాపాడుకుందాం.. నవభారతాన్ని నిర్మించుకుందాం...పేరుతో రూపొందించిన పోస్టర్ ను వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ నేషనల్ డిప్యూటీ చైర్మెన్ కె.ఉషారాణి మంగళవారం వారి నివాసంలో లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువులు పూర్తికాగానే యువత భవిష్యత్తుపై దృష్టి సారించకుండా చెడు వ్యసనాల వైపు వెళ్తూ తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. చదువులు పూర్తికాగానే ఉద్యోగాలు, వ్యాపారాలపై దృష్టి సారిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా కొంతమంది యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆమె కోరారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా వరల్డ్ వైస్ కన్స్యూమర్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ చేస్తున్న పోరాటాన్ని ఆమె ప్రశంసించారు. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. 

యువతలో అవగాహన కల్పిస్తాం: భారత ప్రసాద్

   యువత డ్రగ్స్ మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా వారికి కావాల్సిన అవగాహనను కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని శేరిలింగంపల్లి నియోజకవర్గం చైర్మన్ భారత ప్రసాద్ తెలిపారు. రానున్న డిసెంబర్ 31వ తేదీ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత డ్రగ్స్, మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా త్వరలో పోస్టర్లు, బ్యానర్ల ద్వారా ప్రచారం చేస్తూ చైతన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. దీంతో పాటు కళాశాలలు, పాఠశాలలు, ఇతర ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author: CHIRANJEEVI VADTHYA