జీకే వీధి పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

గూడెం కొత్త వీధి,పెన్ పవర్, జనవరి 26:జీకే వీధి మండలంలోని జీకే వీధి గ్రామ పంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అరుణ్ కుమార్ ఆవిష్కరించారు జీకే వీధి సర్పంచ్ కర్ర సుభద్ర పాల్గొని అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగ విలువలను ప్రతి పౌరుడు కాపాడాలని, దేశ అభివృద్ధికి అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రాజేశ్వరి, ఎంపీటీసీ నాగమణి, కూటమి నాయకులు జనసేనపార్టీ నాయకులు గొర్ల వీర వెంకట్ సిద్ధార్థ, మార్క్ లక్కే రామచంద్ర, పాలు, వైసీపీ నాయకులు కృప, వార్డు మెంబర్ త్రినాథ్‌తో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.వేడుకలు జాతీయ గీతాలాపనతో పాటు మిఠాయిల పంపిణీతో ముగిశాయి.

About The Author: CHANTI BABU MADHIRI

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.