జీవో నెంబర్ 3 కి ప్రత్నామాయ చట్టం తెచ్చిన తర్వాతే మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయాలి!

జీవో నెంబర్ 3 కి ప్రత్నామాయ చట్టం తెచ్చిన తర్వాతే మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేయాలి!

* చంద్రబాబు అరుకులో గిరిజనులకు ఇచ్చిన హామీ అమలు చేయాలి! 

* గిరిజన చట్టం చేయకుండా డీఎస్సీ షెడ్యూల్ ప్రకటిస్తే గిరిజన యువతకు తీవ్ర నష్టం   

  • జీవో నంబర్ 3 పునరుద్ధరించండి లేదా ప్రత్యేక చట్టం తీసుకురండి!  
  • పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు! 

స్టాIMG-20240705-WA0000 ఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జులై 4: గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రత్యేక గిరిజన చట్టం చేసిన తర్వాతే మెగా డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించాలని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు.చేబోలు లీలా ప్రసాద్ అనే గిరిజనేతరుడు సుప్రీంకోర్టులో జీవో నెంబర్ 3 పై వేసిన పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు జీవో నెంబర్ 3 రద్దు చేయడం జరిగిందని అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అరకులోయలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 3 మళ్లీ పునరుద్ధరిస్తామని ప్రకటించారని,దానిని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు కోరారు.జీవో నెంబర్ 3 ని పునరుద్ధరించడం గాని లేదా దానికి సంబంధించి ప్రత్యామ్నాయ గిరిజన చట్టం తేవడం గాని చేపట్టకుండా మెగా డీఎస్సీ షెడ్యూల్ ప్రకటిస్తే ఆదివాసి ప్రాంతంలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు తీవ్రంగా నష్టపోతారని దీనిని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించాలని అన్నారు. ప్రస్తుతం జిల్లా విభజన అనంతరం అల్లూరి జిల్లా ఆదివాసి గిరిజన యువతి యువకులు ఎటువంటి ఉపాధి హామీ పథకాలు లేకపోవడం వలన అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నత చదువులు చదివిన ఉండిపోయారని ఇప్పుడు కనుక డీఎస్సీ షెడ్యూల్ జీవో నెంబర్ 3 పునరుద్ధరించకుండా లేదా ప్రత్యాన్మాయ చట్టం చేయకుండా పోస్టుల భర్తీ చేపడితే గిరిజన ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులు మరింత తీవ్రంగా నష్టపోయే అవకాశం అధికంగా ఉందని దీనిని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 పునరుద్ధరించడం గాని లేదా ప్రత్యేక గిరిజన చట్టం తేవడం గాని చేయాలని లేదంటే గిరిజన నిరుద్యోగ యువతీ యువకులతో ప్రత్యేక పోరాటాన్ని నిర్వహిస్తామని ఆయన అన్నారు.అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో 1/70 యాక్ట్ నిర్వీరం అయిపోతుందని దీనిపై అల్లూరి జిల్లా ఏజెన్సీ అధికార యంత్రాంగం ప్రతిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ విషయంపై ఇటీవల అల్లూరి జిల్లా కలెక్టర్ ను కలిసి మాట్లాడటం జరిగిందని గిరిజన ఆదివాసి ప్రాంతాలలో ఆదివాసి గిరిజనులకే పూర్తిస్థాయి అవకాశం ఉండేలా చూడాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రంగం పై ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరకులోయలో గిరిజనులకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండాలని వాటిని వెంటనే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు కోరారు.

Tags:

About The Author

CHANTI  BABU MADHIRI Picture

అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, అందిస్తుంటారు.  జర్నలిజంలో ఇతనికి 5 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన చంటిబాబు... ప్రత్యేక కథనాలు రాయడం లో ధిట్ట.

Advertisement

LatestNews

వసతి గృహాల్లో సమస్యలు పరిష్కరించాలి.. వైసీపీ నేతలు డిమాండ్
ఈనెల 3న జిల్లాస్థాయి సబ్ జూనియర్ జూడో పోటీలు
సైబర్ నేరాలు, డ్రగ్స్ వద్దు బ్రో, మహిళ నేరాల నివారణ పై అవగాహన
ప్రతీ ఒక్కరూ సనాతన ధర్మం వైపు నడవాలి.. నాగేంద్ర చౌదరి
ఎన్నికల్లో ఓట్లు కోసం తోట వెంకటాచలం మాదిరి కనిపించాలని మీసం గీయించుకున్న వ్యక్తి తోట నరసింహం.. టిడిపి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు
వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: గొర్లే వీర వెంకట్
పురుషోత్తపట్నం ఫేజ్ 2 ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల