ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు
సిటీ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు
On
ఘనంగా పరాక్రమ దివస్ వేడుకలు
హైదరాబాద్ పెన్ పవర్ జనవరి 23:
సిటీ కళాశాలలో ఎబివిపి ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతినీ జరుపుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ఎబివిపి అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ పోరాట పటిమ చాలా గొప్పదని, ఆజాద్ హింద్ పౌజ్ తో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెతించాడు అని అన్నారు.
సుభాష్ చంద్రబోస్ "నాకు మీరు రక్తాన్ని ఇవ్వండి , నేను మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చి పెడతాను" అన్నా మాటలు ఆనాడు ఎందరినో స్వతంత్ర్యం సాధించాలనే ఆకాంక్ష వైపు నడిపింది అని, నేతాజీ ఎందరికో యుద్ధ కాంక్ష ను రగిలించారు అని ఈ సందర్భంగా మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రొఫెసర్లు శంకర్, భాస్కర్ , శ్రీశైలం మరియు ఎబివిపి విద్యార్థి నాయకులు ప్రశాంత్, రాహుల్, గణేష్,శంకర్, అరుణ్, పింకీ, షర్మిల తదితర విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Tags:
