ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్
On
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్
నల్గొండ, తిరుమలగిరి (సాగర్): పెన్ పవర్, జనవరి 05
గట్టుమీద తండా గ్రామపంచాయతీ సర్పంచ్ రమావత్ సోనీ శంకర్ నాయక్ నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఇరు నేతల మధ్య సానుకూల వాతావరణంలో సమావేశం జరిగింది. గ్రామాభివృద్ధి, ప్రజా సమస్యలు, స్థానిక అవసరాలు తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో శంకరన్న టీం సభ్యులు సభావత్ శీను, రమావత్ బాలు, రమావత్ రవి, రమావత్ రఘు, కోర్ర కిషన్, ఆంగోత్ శంకర్, ఆంగోత్ బాల, రమావత్ రమేష్, రమావత్ నగేష్, సభావత్ ముని, రమావత్ సాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
